సినిమా
సమంత సినిమాలో కాంతార విలన్?

Samantha: సమంత కొత్త చిత్రం మా ఇంటి బంగారంతో బిజీ కానుంది. దీనికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. అయితే ఇందులో కాంతార నటుడు గుల్షన్ దేవయ్య విలన్గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతనితో చర్చలు కూడా పూర్తి అయ్యాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
సమంత మా ఇంటి బంగారం సినిమా ప్రకటించింది. దీనికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. ఈ సినిమాని సమంత నిర్మిస్తుంది. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.ఈ సినిమాకి రాజ్ నిడుమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నాడు.
నవంబర్ నుంచి షూటింగ్ ప్రాణం కానుంది. ఇందులో కాంతారా ఫేమ్ గుల్షన్ దేవయ్య విలన్గా నటిస్తున్నాడట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. గుల్షన్ బాలీవుడ్, సినిమాల్లో నటించాడు. కాంతారతో ప్రశంసలు అందుకున్నాడు. మరి ఈ చిత్రంతో ఎలాంటి మ్యాజిక్ చూపిస్తాడో చూడాలి.



