తెలంగాణ
కూలీలపై తేనెటీగల దాడి..15 మందికి తీవ్ర గాయాలు

తేనెటీగల దాడిలో 15 మంది గాయపడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చోటుచేసుకుంది. వెంకట్రావుపేట గ్రామానికి చెందిన 15 మంది కూలీలు వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగల గుంపు వారిపై దాడి చేసింది. తేనెటీగల దాడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూలీలు పరుగులు తీశారు. కూలీల ఆర్తనాదాలు విన్న స్థానికులు, చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.



