తెలంగాణ
మద్యం పాలసీపై కాంగ్రెస్‌లో చిచ్చు

కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం పాలసీ చిచ్చు రేపుతోంది. మద్యం పాలసీ నియంత్రణలో ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వైన్ షాపులకు సమయం కేటాయించాలని, ప్రభుత్వానికి ప్రజారోగ్యమే ముఖ్యంగా ఉండాలని రాజగోపాల్ రెడ్డి గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చామని అందుకు అనుగుణంగానే మద్యంపాలసీ ఉండాలని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో ఎవరు మద్యం దుకాణాలు దక్కించుకున్నా సాయంత్రం 4 గంటలకు వైన్ షాపులు ఓపెన్ చేసి రాత్రి 9 గంటలకు బంద్ చేయాలని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అయితే మునుగోడుకు ఒక పాలసీ, రాష్ట్రానికి మరో పాలసీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.



