Konda Murali: రేవంత్ అన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డాం

Konda Murali: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు గత అర్ధరాత్రి హైదరాబాద్లోని ఆమె నివాసం వద్దకు పోలీసులు రావడం, సురేఖ కూతురు సుస్మిత వాళ్లతో వాగ్వాదానికి దిగడం, ఈ క్రమంలో సంచలన ఆరోపణల చేసింది. అయితే ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ, సురేఖ భర్త కొండా మురళి స్పందించారు.
హైదరాబాద్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు సుమంత్ వ్యవహారంలోనూ ఏం జరుగుతుందో తెలియదని కొండా మురళి అన్నారు. సెక్రటేరియట్లో కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదన్నారు.
సుస్మితకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. తాను ఇబ్బంది పడ్డాడటం వల్ల అలా మాట్లాడి ఉంటుందన్నారు. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డామన్నారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తానని రేవంతన్న హామీ ఇచ్చారు. తప్పకుండా ఇస్తారు కూడా. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదున్నారు. అందరి మంత్రుల ఇండ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉందన్నారు.
అందరి మంత్రుల ఇండ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది. నేను మంత్రుల వద్దకు వెళ్తాను. పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని అడుగులు వేస్తా. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ అన్నతో మాట్లాడి సమస్య సాల్వ్ అయ్యేలా చేస్తా. ఎవరి తప్పు ఉన్నా, సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తా. మీడియా ముందు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ చెప్పారు. మళ్ళీ మీనాక్షి గారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతా. మీనాక్షి అమ్మ చెప్పినట్లు వింటాను.
నన్ను తిట్టిన వల్లే మళ్ళీ నా కోసం వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్ట్ పనులు కోసం నా దగ్గరకు వచ్చిన వాడే. వేం నరేందర్ రెడ్డి(సీఎం సలహాదారు) నేను కామన్ గా కలుస్తుంటాం. నేను ఎవరికీ టార్గెట్ కాను, నాకు ఎవరూ టార్గెట్ లేరు. నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టం అని మురళి అన్నారు.



