తెలంగాణ
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

నేడు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ప్రధానంగా మెట్రో రైలు ప్రాజెక్టు స్వాధీనంపై మంత్రివర్గం చర్చించనున్నారు. కొత్తగా సవరించిన హ్యామ్ రోడ్ల ప్రతిపాదనలను క్యాబినెట్ ముందుకు తీసుకొచ్చి, టెండర్ల కోసం ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలిసింది.
వీటితో పాటు ధాన్యం సేకరణ, బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎల్ఎస్బీసీ సొరంగం పనుల పునఃప్రారంభం, గిగ్ వర్కర్ల సంక్షేమం, టీ ఫైబర్ విస్తరణ, మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం, తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.



