తెలంగాణ
మియాపూర్‌లో దారుణం.. కన్న కూతురిని వేధింపులకు గురి చేసిన కన్నతల్లి, సవతి తండ్రి

హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. కూతురిని కన్నతల్లి, మారు తండ్రి వేధింపులకు గురి చేసింది. ఓల్డ్ హాఫీజ్‌పేట్ ప్రాంతంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి ఒంటిపై గాయాలను స్థానికులు గమనించారు. ప్రతిరోజు మారు తండ్రి, తల్లి కొడుతోందని చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి, మారు తండ్రి అరెస్ట్ రిమాండ్ తరలించారు.



