తెలంగాణ

ఈనెల 11 నుంచి వేములవాడ రాజన్న ఆలయం మూసివేత

సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం ఈనెల 11 నుండి మూసివేయనున్నారు. రాజన్న ఆలయాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భక్తుల దర్శనాల కోసం అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో మూడు కోట్ల 44 లక్షల రూపాయలతో నూతనంగా షెడ్ల నిర్మాణం, క్యూలైన్లు, నిత్య కళ్యాణమండపం, ప్రసాదాల కౌంటర్లు యుద్ధ ప్రాతిపదికను ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనెల 12 నుండి భీమేశ్వర స్వామి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు ఉంటాయని, సాధ్యమైనంత త్వరలో రాజన్న ఆలయాన్ని విస్తరించి భక్తుల దర్శనాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 19, 20 న జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ విజయ శేఖర భారతి తీర్థ మహాస్వామి వేములవాడ రాజన్న దర్శించుకుని పలు సూచనలు చేయనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button