తెలంగాణ
Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి 6ఇళ్లలో చోరీ

ఖమ్మం వైఎస్సార్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. బంగారు, వెండి ఆభరణాలు నగదును ఎత్తుకెళ్లారు. దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసి చోరీకి పాల్పడ్డారు. కానిస్టేబుల్ ఇంటినీ దొంగలు వదలలేదు. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. వరుస దొంగ తనాలతో ఖమ్మం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.



