‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్: రిషబ్ శెట్టి మాయ!

Kantara Chapter 1 Trailer: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార’ సినిమా సంచలనం సృష్టించింది. ఇప్పుడు దాని సీక్వెల్ ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ విడుదలైంది. అద్భుతమైన విజువల్స్, ఎమోషన్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పూర్తి వివరాలు చూద్దాం.
రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన ‘కాంతార’ సినిమా దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ‘నాన్న ఎందుకు మాయమయ్యాడు?’ అనే ప్రశ్నతో ట్రైలర్ ఆరంభం కాగా, అద్భుతమైన విజువల్స్, శక్తివంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకుంటోంది.
స్థానిక సంస్కృతి, ఎమోషనల్ టచ్‌తో కూడిన ఈ ట్రైలర్ 2 నిమిషాల 57 సెకన్ల నిడివితో ఉత్కంఠ రేపుతోంది. ప్రతి షాట్‌లోనూ ఉన్న నాణ్యత, మేకింగ్ శైలి సినిమాపై ఆసక్తిని పెంచాయి. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా ఆంధ్రాలో గీత ఆర్ట్స్, నైజాంలో మైత్రీ ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ అవుతోంది. ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించింది.



