తెలంగాణ

ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసిన కుమార్తె

మానవత్వం మంట కలుస్తుంది. రక్త సంబంధమని కూడా చూడకుండా స్వంతవారినే కడతేర్చుతున్నారు కొందరు . జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్దతండలో నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లినే కన్న కూతురు హత్యచేసింది. ఆస్తికోసం తన భర్తతో కలిసి గొంతు నులిమి చంపేసింది. గ్రామానికి చెందిన బాదావత్ లక్షి తన కుమార్తెను దుబ్బ తండాకు చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేసింది.

అయితే తల్లికున్న ఆస్తిని కాజేయాలని పథకం పన్ని భర్తతో కలిసి చంపేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటించగాస్తానికులు పోలీసులకు సమాచారమందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కూతురు, అల్లుడే బాదావత్ లక్ష్మీని హత్య చేసినట్లుగా తేల్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button