తెలంగాణ
Ganesh Shobha Yatra: నిర్మల్ జిల్లాలో ఘనంగా సాగుతున్న శోభాయాత్ర

Ganesh Shobha Yatra: నిర్మల్ జిల్లాలో గణనాథుడి శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. బుధవారపేట కాలనీలో ఒకటో నెంబర్ వినాయక మండపం వద్ద ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. హిందూ బంధువుల, హిందూ ఉత్సవ కమిటీ సభ్యుల జయ జయ ధ్వానాల మధ్య శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. జిల్లా కేంద్రంలో గణనాథుని శోభాయాత్ర చాలా ప్రత్యేకమని ఎమ్మెల్యే అన్నారు. 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించుకుంటున్నామని వెల్లడించారు.



