సినిమా
Shwetta Parashar: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్వేతా పరాశర్

తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి శ్వేతా పరాశర్ దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల చేరుకున్న ఈ భామ, ఇవాళ విఐపీ బ్రేక్ సమయంలో మూలమూర్తిని దర్శించుకున్నారు, అనంతరం స్వామివారి వారి తల్లి వకూళమాతను, యోగనరసింహస్వామివారిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు నటి శ్వేతా పరాశర్ కి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు. అనంతరం ఆలయంలో చేరుకున్న అమెను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.



