తెలంగాణ
గజ్వేల్‌లో యూరియా కోసం రైతన్నల క్యూ

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో యూరియా కోసం రైతులు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. గజ్వేల్ వ్యవసాయ అధికారి నాగరాజును ఓ రైతు యూరియా కావాలంటూ లాక్కెళ్లాడు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉదయం 4 గంటలకు వచ్చి లైన్లో నిలిస్తే యూరియా లేదని షాప్ యజమానులు దుకాణాలు మూసేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు యూరియాను ఫర్టిలైజర్ షాప్‌లకు కాకుండా మార్కెట్ యార్డులో పంపిణీ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కేసీఅర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా పుష్కలంగా లభించిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక యూరియా కోసం క్యూ లైన్లలో నిలుచునే పరిస్తితి వచ్చిందనీ రైతులు వాపోయారు.



