తెలంగాణ
భర్తను టవల్‌తో ఉరేసిన భార్య

అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి చంపిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్‌కు చెందిన వివాహిత అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సంబంధం కొనసాగించింది. భర్తకు ఈ విషయం తెలియడంతో ఆయన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడుతో కలిసి భర్తను టవల్‌తో గొంతు నులిపి హత్య చేసింది.
భర్త మృతదేహాన్ని బాత్రూమ్‌లో పడేసి మూర్చరోగంతో మృతి చెందినట్లు బంధువులను నమ్మించింది. దుబాయ్ నుంచి కొడుకు వచ్చి కర్మకాండలు చేశాడు. తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు విచారణలో వివాహితురాలు, ఆమె ప్రియుడు నేరం ఒప్పుకోవడంతో ఇద్దరినీ కోర్టులో హాజరుపర్చారు.



