తెలంగాణ
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద నాలాను పరిశీలించిన మంత్రి పొన్నం

Ponnam: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లే రోడ్డులో కేబీఆర్ పార్క్ వద్ద వాటర్ లాగింగ్ పాయింట్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కేబీఆర్ పార్కులో ఉన్న చెరువు నిండడంతో వర్షం నీరు రోడ్డుపైకి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ భవన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వెళ్లే మార్గంలో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
వాటర్ నిల్వ లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా నీళ్లు వెళ్లేలా తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. చెరువు నుంచి వచ్చిన నీరు రోడ్డుపైకి కాకుండా నేరుగా నాళాలోకి వెళ్లేలా పనులు ప్రారంభించాలని ఆదేశించారు.



