తెలంగాణ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఇంటి ముందు రైతుల ధర్నా

Farmers Protest: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాసం వద్ద ఫార్మాసిటీ రైతులు నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఫార్మాసిటీని రద్దు చేయలేదంటూ నిప్పులు చెరిగారు. ఫార్మాసిటీని రద్దు చేసి తమ భూములు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. మలక్‌పేట్‌లోని రంగారెడ్డి నివాసం వద్ద నిరసనకు దిగారు.



