తెలంగాణ

వికారాబాద్ జిల్లా పూడూరులో గంతల రోడ్లపై వరినాట్లు

వికారాబాద్ జిల్లా పూడూరులో గుంతల రోడ్లపై వరినాట్లు వేశారు గ్రామస్థులు. చిట్టెంపల్లి గేటు నుంచి కంకల్ వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. దీంతో గ్రామస్థులు రోడ్డులో వరినాట్లు నాటారు. 15 సంవత్సరాల కింద వేసిన రోడ్డు మళ్లీ తిరిగి ఇప్పటివరకు వేయకపోవడంతో పూర్తిగా గుంతలమయంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

చిట్టెంపల్లి గేటు నుంచి లాల్పాడు వరకు డబుల్ రోడ్ సాంక్షన్ అయితే ఇప్పటివరకు పనులు చేయడంలేదని వాపోయారు. పెద్ద పెద్ద గుంతల్లో గనేట్ రాళ్లు ఉన్నాయని ద్విచక్ర వాహనదారులకు ప్రమాదమని ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నాయన్నారు. ఇప్పటికైనా స్పందించి రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కంకల్ గ్రామస్తులు కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button