సినిమా

Pawan Kalyan: ఎట్టకేలకు పవన్ ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైన వస్తుందా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ‘హరి హర వీరమల్లు’ చిత్రం జులై 24న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో సందడి మొదలవనుంది.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీ ఖరారైంది. జులై 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. పవన్ ఓ ధీరోదాత్త యోధుడిగా, మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్. గ్రాండ్ నిర్మాణ విలువలు, అద్భుతమైన దృశ్యాలతో ఈ చిత్రం విజువల్ వండర్‌గా రూపొందింది. రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉన్నప్పటికీ, పవన్ తన అభిమానుల కోసం సినిమాకు సమయం కేటాయించారు.

త్వరలో విడుదల కానున్న ట్రైలర్, గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో హైప్ మరింత పెరగనుంది. అయితే ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఈసారైన పక్కాగా వస్తుందా రాదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button