సినిమా

Sekhar Kammula: లీడర్ 2పై శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు!

Sekhar Kammula: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాకు సీక్వెల్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం కథ రెడీగా ఉందని, త్వరలోనే అప్‌డేట్స్ వస్తాయని సమాచారం. ప్రస్తుతం కుబేర రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

టాలీవుడ్‌లో క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన శేఖర్ కమ్ముల నుంచి మరో సంచలనం రాబోతోంది. రానా దగ్గుబాటి హీరోగా 2010లో వచ్చిన పొలిటికల్ డ్రామా లీడర్ సినిమాకు సీక్వెల్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లీడర్ 2 కథ ఇప్పటికే సిద్ధంగా ఉందని, అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రేక్షకుల ఆలోచనా విధానం మారిన నేపథ్యంలో కథను మరింత పక్కాగా తీర్చిదిద్దాలని శేఖర్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సీక్వెల్ ఖచ్చితంగా రూపొందుతుందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కావచ్చని సమాచారం. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన లేటెస్ట్ ప్రాజెక్ట్ కుబేర చిత్రంపై దృష్టి పెట్టారు. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లీడర్ 2 ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button