సినిమా

అల్లు అర్జున్ – అట్లీ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్?

Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో బిగ్ బ్యాంగ్‌తో రాబోతున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఓ సంచలన చిత్రం కోసం సిద్ధమవుతున్న బన్నీ, ఈ సినిమాలో ఎలాంటి రోల్‌లో మెస్మరైజ్ చేస్తాడు? ఈ సినిమా టైటిల్ ఏంటి? అనే అంశాలు వైరల్ అవుతున్నాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంతో సినీ ప్రియులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. తమిళ హిట్‌మేకర్ అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం పాన్-వరల్డ్ స్థాయిలో భారీగా తెరకెక్కనుంది. అల్లు అర్జున్ పాత్ర గురించి సినీ వర్గాల్లో ఇప్పటికే హైప్ మొదలైంది. సన్ పిక్చర్స్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.

‘ఈ సినిమా టైటిల్‌పై కూడా ఆసక్తికర సమాచారం వినిపిస్తోంది. ‘ఐకాన్’ టైటిల్‌ను అట్లీ ఖరారు చేయనున్నట్లు టాక్. గతంలో ఈ టైటిల్‌తో బన్నీ ఓ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ టైటిల్‌తో సినిమా వస్తుందనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. అట్లీ టచ్‌తో బన్నీ ఈ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button