తెలంగాణ
హైదరాబాద్లో పలువురి ఇళ్లలో DRI తనిఖీలు

హైదరాబాద్లోని పలువురి ఇళ్లలో DRI అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. వ్యాపారి బషరత్ నుండి లగ్జరీ కార్లు.. కొనుగోలు చేసిన వారి వివరాలు ఇప్పటికే సేకరించారు. ఇందులో భాగంగా బడా బాబులకు బషరత్ పది కార్లు అమ్మినట్లు గుర్తించారు.
అయితే లగ్జరీ కార్ల విషయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి పన్ను ఎగవేశారన్న కారణంతోనే దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న DRI అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ నుంచి హైదరాబాద్కు వచ్చాయి ఈ DRI బృందాలు.



