వ్యాపారం
Microsoft: మరోసారి భారీగా లేఆఫ్‌లు ప్రకటించనున్న మైక్రోసాఫ్ట్

Microsoft: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. 2023లో పది వేల మందిని తొలగించిన ఈ సంస్థ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో మూడు శాతం మందికి లేఆఫ్‌లు ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఏడాది జూన్ నాటికి ఈ సంస్థలో 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
తాజాగా మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు అంచనా. మార్కెట్లో పైచేయి సాధించేలా ఉత్తమంగా ఉండేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేయడానికే ఉద్యోగాల కోత అని సమాచారం.