తెలంగాణ
Jaggareddy: జీవితంలో సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయను

Jaggareddy: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను జీవితంలో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి అవమానించానేమో అని ఫీల్ అయ్యానని జగ్గారెడ్డి అన్నారు.
తన కోసం ఆయన సంగారెడ్డికి వచ్చారు. నన్ను గెలిపించాలని గట్టిగా ప్రచారం చేశారని అన్నారు. అంతగా ఆయన ప్రచారం చేసినప్పటికీ ఇక్కడి ప్రజలు తనను ఓడించారని అన్నారు.. సంగారెడ్డిలో తాను ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయనని జగ్గారెడ్డి అన్నారు.



