తెలంగాణ
కృష్ణ కాంత్ పార్క్ వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణ కాంత్ పార్క్ వద్ద సందడి నెలకొంది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయ రెడ్డి హాజరయ్యారు. యువతులు, చిన్నారులు, మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఆడపడుచులు అందరూ ఒకే చోట చేరి బతుకమ్మ ఆడి ఉత్సాహంగా సంబురాలు చేసుకున్నారు.
వేలాది సంఖ్యలో మహిళలు వచ్చి బతుకమ్మ ఆటలాడారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన 16 ఫీట్ల హంస రూప బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేసి ఆహ్లాదంగా గడిపారు.



