అంతర్జాతీయం
Donald Trump: కెనడా ఉత్పత్తులతో మాకు అవసరం లేదు

Donald Trump: కెనడా ఉత్పత్తులపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడా ఉత్పత్తులతో తమకు అవసరం లేదని తేల్చిచెప్పారు. కెనడా తమదేశ పాల ఉత్పత్తులపై 250శాతం సుంకాలు విధిస్తోందన్న ట్రంప్ కలపపై కూడా అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు.
అయితే ఇప్పుడు కెనడాపై ఆధారపడకుండా తమ దేశ అడవు ల్లోని కలపను వినియోగించుకునేలా ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లు చెప్పారు ట్రంప్. ఇక ఇతర దేశాల అవసరం లేకుండానే తాము స్వయం సమృద్ధిని సాధించుకోగలమన్నారు ట్రంప్.