తెలంగాణ
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. మేడారం హరిత హోటల్‌లో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. మేడారం మాస్టర్ ప్లాన్‌పై కేబినెట్ చర్చించనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లు.. జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది.



