సినిమా

Mad Square: ప్రపంచవ్యాప్తంగా అదరగొట్టిన ‘మ్యాడ్ స్క్వేర్’

Mad Square: ఉగాది సందర్భంగా తెలుగు సినీ అభిమానులకు కానుకగా వచ్చిన తాజా చిత్రాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీని దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించారు.

సాలిడ్ హైప్‌తో ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ‘మ్యాడ్ స్క్వేర్’ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టి మేకర్స్ అంచనాలను అందుకుంది. తాజాగా, మేకర్స్ అధికారికంగా ప్రపంచవ్యాప్త గ్రాస్ నంబర్స్‌ను వెల్లడించారు. ఏకంగా 20.8 కోట్ల గ్రాస్‌ను ‘మ్యాడ్ స్క్వేర్’ ఒక్క రోజులోనే సాధించిందని టీమ్ ప్రకటించింది. ఈ భారీ ఓపెనింగ్‌తో సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది.

రెండో రోజు కలెక్షన్స్ కూడా దూసుకెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. బాక్సాఫీస్ వద్ద ‘మ్యాడ్ స్క్వేర్’ రాబోయే రోజుల్లో సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా హిట్ టాక్‌తో పాటు కలెక్షన్స్‌లోనూ దూకుడు కనబరుస్తూ తెలుగు సినిమా పరిశ్రమలో మరో సక్సెస్ మూవీగా నిలవనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button