సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై హైకోర్టులో కేసు!

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపణలు చేశారు. కేసు వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ సీబీఐ విచారణ కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లను చేర్చాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ కేసు రాజకీయ, సినిమా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button