తెలంగాణ
సోనియా గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలును ప్రశ్నిస్తూ కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించారు.
అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలు గురించి ఏనాడైనా తెలుసుకునేందుకు ప్రయత్నించారా కనీసం సీఎం రేవంత్ మిమ్మల్ని కలిసిన సమయంలోనైనా వాటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారా అని కిషన్ రెడ్డి లేఖలో ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పాలి భస్మాసుర హస్తంగా మారతాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు.



