12A Railway Colony: హార్రర్ థ్రిల్లర్ తో నరేష్ మరో ప్రయోగం.. ఆకట్టుకుంటున్న టీజర్!

12A Railway Colony: కామెడీ చిత్రాలతో బాగా ఫేమస్ అయిన అల్లరి నరేష్.. కొన్నాళ్లుగా తన రూట్ మార్చి డిఫరెంట్ డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. బచ్చలమల్లి సినిమాతో ఆఖరిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లరి నరేష్ ఇప్పుడు మరోసారి వేరే జానర్ తో వస్తున్నాడు.
తాజాగా నరేష్ నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చింది.ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ దానికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 12ఎ రైల్వే కాలనీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పొలిమేర ఫ్రాంచైజ్ సినిమాలకు వర్క్ చేసిన రైటర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు స్టోరీ అందించారు.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు.
ఈ సినిమా హార్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. టీజర్ చూడగానే సినిమా ఉత్కంఠభరితంగా, థ్రిల్లింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది.అల్లరి నరేషన్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో అతని లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ అందరినీ కట్టిపడేశాయి.
పొలిమేర సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న కామాక్షి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఖుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో అందించిన బీజీఎం మరింత ఎలివేట్ అయ్యేలా చేసింది. ఈ సినిమా సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతుంది.