తెలంగాణ

Sridhar Babu: మహిళా సాధికారిత దిశగా కృషి

Sridhar Babu: మహిళా సాధికారిత దిశగా కృషి చేస్తున్నామన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జిల్లా కలెక్టర్ రాహుల్‌తో కలిసి చీరలు పంపిణీ చేశారు. అలాగే కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు మంత్రి.

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తున్నామని వచ్చే ఏడాది పట్టణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button