రేజర్’ టైటిల్ గ్లింప్స్: బ్రూటల్ అవతారంలో రవిబాబు.. షాకింగ్ వీడియో!

Razor: యాక్టర్ కమ్ దర్శకుడు రవిబాబు కొత్త చిత్రం ‘రేజర్’ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. న్యాయం కోసం బ్రూటల్‌గా మారిన రవిబాబు లుక్ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తోంది. ముగ్గురిని దారుణంగా హతమార్చిన సన్నివేశాలు షాక్ ఇస్తున్నాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్‌తో రవిబాబు మరో ట్రీట్ ఇవ్వనున్నారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చిత్రాలతో అలరించే రవిబాబు మరో క్రైమ్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఈ చిత్రానికి ‘రేజర్’ అనే ఆకర్షణీయ టైటిల్ ఖరారు చేశారు. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తోంది. న్యాయం కోసం బ్రూటల్ రూపం ధారణ చేసిన రవిబాబు ముగ్గురు వ్యక్తులను అత్యంత దారుణంగా హతమార్చిన సన్నివేశాలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
ఈ గ్లింప్స్‌తో రవిబాబు ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ సినిమాని ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. 2026 వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రవిబాబు ఈ సినిమాతో ఎలాంటి థ్రిల్లింగ్ అనుభవం అందించనున్నారో అని ఆసక్తి నెలకొంది.



