తెలంగాణ
తెలంగాణలో నామినేటెడ్ పదవుల ఉత్కంఠ

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులను రేవంత్ సర్కార్ త్వరలోనే భర్తీ చేయనుంది. దాదాపుగా 50 కార్పొరేషన్ పదవులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇందులో సగానికి పైగా కార్పొరేషన్ పదవులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. జాతీయ నాయకత్వం ఇప్పటికే చైర్మన్ పేర్లను ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే కొన్ని కార్పొరేషన్ నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన వాటికి డైరెక్టర్లను నియమించలేదు. జూన్ 2026 వరకు భర్తీ చేసిన కార్పొరేషన్ చైర్మన్ల కాలం ముగియనుంది. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవులు, జూన్‌లో ఖాళీ కాబోతున్న కార్పొరేషన్ పదవులను ఒకేసారి భర్తీ చేయనున్నట్లు సమాచారం. అప్పుడు చైర్మన్లతో సహా కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించే అవకాశం.



