సినిమా
Chiranjeevi: సినీ కార్మికుల వేతన పెంపుపై చిరంజీవి హర్షం.. సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు

Chiranjeevi: సినీ కార్మికుల వేతన పెంపునకు అంగీకారం కుదరడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇటు నిర్మాతలకు, అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ సీఎంకి థాంక్స్ చెప్పారు.
ఈ మేరకు ‘ఎక్స్ వేదికగా చిరు స్పెషల్ పోస్టు పెట్టారు.తెలుగు చిత్రసీమ ఇలానే కలిసి మెలిసి ముందుకు సాగాలని, ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నా అని చిరంజీవి ట్వీట్ చేశారు.



