ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: పోలీస్ కస్టడీలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని కస్టడీలోకి తీసుకున్నారు హనుమాన్ జంక్షన్ పోలీసులు. ఈ కేసులో రెండ్రోజులపాటు వంశీని విచారించనున్నారు పోలీసులు. ప్రస్తుతం కంకిపాడు పీఎ స్‌లో వంశీ విచారణ కొనసాగుతోంది.