తెలంగాణ

Jagga Reddy: మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి… కంటిచూపు కోల్పోయిన బాలుడికి ఆర్ధిక సాయం

Jagga Reddy: 12 ఏళ్ల అంధ బాలుడు, సింగర్ వికాస్ నాయక్ కు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అపన్న హస్తం అందించారు. కామారెడ్డి జిల్లా లోంకాతండాకు చెందిన వికాస్ నాయక్ తండ్రి తీవ్ర అనారోగ్యంపాలై మంచాన పడ్డాడు. దీంతో అతని చికిత్సకోసం చేసిన 7లక్షల 50 వేల అప్పును తీర్చేందుకు తన అమ్మ, తాతయ్య, అమ్మమ్మతో కలిసి జగ్గారెడ్డిని కలిసి ఆర్థిక సాయం చేయాలని కోరాడు. వెంటనే స్పందించిన జగ్గారెడ్డి 7లక్షల 50వేల నగదు అందించారు.

వికాస్ నాయక్ పౌరాణిక గాథల్లోని పద్యాలను అలవోకగా చెప్పిన తీరును చూసి అభినందించారు. తానే స్వయంగా యుట్యూబ్ ఛానల్ పెట్టుకుంటానని, తనకు సపోర్ట్ చేయమని వికాస్ నాయక్ జగ్గారెడ్డిని కోరడంతో వెంటనే ఓ స్మార్ట్ ఫోన్ తెప్పించి ఇవ్వడమేకాకుండాఅన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. స్వయంగా కారు ఏర్పాటు చేసి అతని కుటుంబాన్ని స్వస్థలానికి పంపించారు. ప్రస్తుతం వికాస్ నాయక్ నిజామాబాద్ లోని స్నేహా సొసైటీ అంధుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button