తెలంగాణ
Vemula Veeresham: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ దాడి

Vemula Veeresham: నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ దాడి జరిగింది. న్యూడ్ కాల్స్‌తో ఎటాక్ చేశారు కేటుగాళ్లు. వేముల వీరేశం సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫొటోలను సేకరించారు. అలాగే స్క్రీన్ రికార్డు చేసి పర్సనల్ నెంబర్ వాట్సాప్‌కి వీడియోలు పంపి బెదిరింపులకు దిగారు.
వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలా? లేక డబ్బులు పంపిస్తావా అంటూ వీరేశంను బెదిరించినట్లు తెలుస్తుంది. వాట్సాప్ చాటింగ్ ద్వారా బెదిరింపులు కొనసాగినట్లు వీరేశం చెబుతున్నారు.
మరోవైపు తనపై జరిగిన సైబర్ దాడితో పోలీసులను ఆశ్రయించారు వేముల వీరేశం. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తనకు మధ్యప్రదేశ్ నుండి కాల్స్ వచ్చినట్లు నకిరేకల్ పోలీసులకు చెప్పినట్లు వివరించారు.