IT Raids: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

IT Raids: హైదరాబాద్‌లో సోటీ సోదాలు కొనసాగుతున్నాయి. సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప 2కు పెట్టిన బడ్జెట్‌పై ఐటీ అధికారులు ఆరా తీశారు. పాన్ ఇండియా మూవీ పుష్పకు వచ్చిన ఆదాయంపై ఐటీ శాఖ విచారణ చేస్తుంది. సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం మూవీ బడ్జెట్‌పై ఆరా తీస్తుంది. డాకు మహారాజ్ నైజాం డిస్టిబ్యూటర్‌గా దిల్ రాజు ఉన్నారు.
గేమ్ ఛేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన, సంక్రాంతి కి వస్తున్నాం మూవీ బాక్స్ ఆఫీక్ వద్ద భారీ విజయం సాధించింది. సినిమాలకు భారీ బడ్జెట్‌తో నిర్మించడం.. వాటికి వస్తున్న రెవెన్యూ కూడా భారీగా ఉండటంతో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తుంది. చెల్లించిన ఆదాయపు పన్నుకు..వస్తున్న రాబడులకు పొంతన లేకపోవడంతో ఐటీ శాఖ రంగంలోకి దిగింది. చిత్రాల నిర్మాణాలకు అయిన ఖర్చులు, వస్తున్న ఆదాయాలపై ఆరా తీస్తుంది.