తెలంగాణ
యాదాద్రి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ హౌజ్ అరెస్ట్

యాదాద్రి భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నాయకులను హౌజ్ అరెస్ట్ చేశారు. ఇక ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ను పోలీసులు హైదరాబాద్‌లో హౌజ్ అరెస్ట్ చేశారు.



