జాతియం
ప్రధాని మోదీతో నేపాల్ ప్రధాని బలేంద్ర షా ద్వైపాక్షిక భేటీ

భారత్, నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. నేపాల్ ప్రధాని బలేంద్ర షా, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రవాణా, పెట్టుబడులు, ఇంధనం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చలు జరిపారు.
అనంతరం అయోధ్య ధామ్ నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్‌ను అనుసంధానించే కొత్త రైలు సర్వీస్‌ను ఇరు దేశాల ప్రధానులు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ రైలు సర్వీస్‌కు సరయు–కమలా ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టారు. ఇరు దేశాల మధ్య రవాణా, ఆధ్యాత్మిక అనుబంధాలకు ఇది మరింత బలాన్నివ్వనుంది.



