తెలంగాణ
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత..!

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడి నుంచి 9 బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 1.05 కిలోల బంగారం విలువ సుమారు రూ.1.37 కోట్లు ఉంటుందని అధికారులు గుర్తించారు.
ఎయిర్పోర్టు బయట బంగారం కోసం ఎదురుచూస్తున్న మరో వ్యక్తిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఇద్దరిపై కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరినీ జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.



