అంతర్జాతీయం
అమరావతి పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణతో పాటు వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. గడిచిన నెలలో రాజధానిలో రూ.1,345 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు.
ప్రతి నెలా రూ.2 వేల కోట్ల మేర పనులు జరిగేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం 152 ప్రాజెక్టుల్లో 41 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించారు.



