ఆంధ్ర ప్రదేశ్

జైరాం రమేశ్‌ ట్వీట్‌పై చంద్రబాబు ఘాటు కౌంటర్‌

మదనపల్లి ఘటనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ చేసిన ట్వీట్‌పై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రజల్లో కనిపించింది ఆగ్రహం కాదని.. అపారమైన ఉత్సాహం, అనూహ్య స్పందన అని చంద్రబాబు స్పష్టం చేశారు. సభ సజావుగా సాగేందుకు ప్రజల ఉత్సాహం కారణంగా తాను కొద్దిసేపు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రజల స్పందనను ఆగ్రహంగా చిత్రీకరించడం చూస్తే.. ప్రజల ఆలోచనలకు జైరాం రమేశ్‌ ఎంత దూరంగా ఉన్నారో అర్థమవుతోందని అన్నారు.

ఇక జైరాం రమేశ్‌ ట్వీట్‌పై మంత్రి లోకేశ్‌ కూడా ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండానే ఫేక్‌ న్యూస్‌ను ట్వీట్‌ చేయడం సీనియర్‌ నేతగా ఆయన స్థాయికి తగదన్నారు. నిర్మలా సీతారామన్‌ ప్రసంగాన్ని స్థానిక యువత అడ్డుకున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రజల ఉత్సాహభరిత స్పందనను కావాలనే కట్‌ చేసి వక్రీకరించారని ఆరోపించారు. తప్పుడు ట్వీట్‌ను వెంటనే తొలగించాలని జైరాం రమేశ్‌ను లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button