అంతర్జాతీయం
Donald Trump: ఒప్పందం కుదరకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తాం

ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ ముందుకు రావాలని స్పష్టం చేసిన ట్రంప్ ఒప్పందానికి అంగీకరిస్తారా. లేక తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారా అంటూ ప్రశ్నించారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే దౌత్యపరమైన పరిష్కారానికి మార్గం ఉంటుందని కానీ ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.



