తెలంగాణ
నిరీక్షణ ముగిసింది..నిర్ణయమే మిగిలింది .. కొండా సురేఖ సంచలన పోస్ట్!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ‘నిరీక్షణ ముగిసింది.. నిర్ణయమే మిగిలింది’ అంటూ ఆమె చేసిన తాజా పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు రేకెత్తిస్తోంది.
నా ప్రకటన కోసం తెలంగాణ ప్రజలు వేచి చూడాలని, త్వరలోనే ఒక బిగ్ అప్డేట్ వస్తుందని ఆమె ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామం వెనుక అసలు ఎలాంటి వ్యూహం ఉంది? కొండా సురేఖ తీసుకోబోయే ఆ కీలక నిర్ణయం ఏంటనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.”



