తెలంగాణ
కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

కొండా సురేఖ ఎపిసోడ్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ ఓఎస్డీ అరెస్ట్ నుంచే అసలు కథ మొదలైందని.. అప్పుడే మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. డబ్బుల వాటా విషయంలో వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగానే వివాదం ముదిరి.. ఇప్పుడు రాజీనామా వరకు వచ్చిందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి ఎక్కడ చూసినా జరుగుతోందని రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పడిపోతుందో అన్న అనుమానంతోనే నేతలు దోపిడీకి పాల్పడుతున్నారంటూ విమర్శించారు. కొండా సురేఖను బర్తరఫ్ చేస్తామని అధిష్టానం చెప్పినట్లు ప్రచారం జరుగుతోందని.. ఈ నేపథ్యంలో ఆమె ప్రెస్మీట్లో ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారిందన్నారు.



