తెలంగాణ

నేడు రవాణా, డెలివరీ యాప్‌ల సేవలు బంద్

రాష్ట్రంలో మోటారు వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ అమలు చేయడంతో పాటు కనీస బేస్ ఫేర్ నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ గిగ్ వర్కర్లు, యాప్ ఆధారిత డ్రైవర్లు ఆకస్మిక సమ్మెకు పిలుపునిచ్చారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్, డ్రైవర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు ఈ సమ్మె కొనసాగనుంది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 నుంచి 3 లక్షల మంది కార్మికులు ఇందులో పాల్గొంటున్నట్లు ప్రతినిధులు తెలిపారు. దీనివల్ల ఓలా, ఊబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి యాప్ ఆధారిత రవాణా, ఫుడ్ డెలివరీ సేవలు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

కంపెనీలు ఇష్టారాజ్యంగా ఛార్జీలు కేటాయించే పద్ధతిని నిలిపివేసి, నిబంధనల ప్రకారం ప్రతీ కార్మికుడికి కనీస ఆదాయం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల భద్రత, సంక్షేమం కోసం వెంటనే వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మె, నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమ్మెకు సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ సహా పలు ప్రధాన కార్మిక సంఘాలు మద్దతు పలికాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button