తెలంగాణ

నేడు రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల అధికారి భేటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు రాజకీయ పార్టీలతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీలో ప్రధానంగా ఓటర్ల జాబితా సవరణ,పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ భేటీలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.

పాత రిజర్వేషన్ల ప్రకారమే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మున్సిపాలిటీ వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఖరారు చేస్తారు. మున్సిపల్‌ చైర్మన్లు, మున్సిపల్‌ మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ప్రభుత్వం నుంచి అందే రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button