అవెంజర్స్ డూమ్స్‌డే టీజర్ వైరల్!

Avengers Doomsday: మార్వెల్ స్టూడియోస్ ఎవెంజర్స్: డూమ్స్‌డే టీజర్‌ను అధికారికంగా విడుదల చేసింది. రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది. డార్క్ టోన్‌లో సాగే టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. చివర్లో కెప్టెన్ మార్వెల్ షాట్ హైలైట్‌గా నిలిచింది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులకు భారీ అప్డేట్ వచ్చింది. ఎవెంజర్స్: డూమ్స్‌డే టీజర్‌ను మార్వెల్ స్టూడియోస్ అధికారికంగా విడుదల చేసింది. డార్క్ టోన్‌లో సాగే ఈ టీజర్ భారీ యాక్షన్, ప్రపంచ వినాశనం, కొత్త సమస్యల చుట్టూ కథను సూచిస్తోంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మిస్టీరియస్ షాట్స్ సినిమాపై గ్లోబల్ హైప్‌ను పెంచాయి.
పాత అవెంజర్స్‌తో పాటు కొత్త హీరోలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంసీయూలో ఇది టర్నింగ్ పాయింట్‌గా మారనుందని మార్వెల్ వర్గాలు తెలిపాయి. టీజర్ చివర్లో కెప్టెన్ షాట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం 2026 డిసెంబరు 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఐమ్యాక్స్, 3డీ ఫార్మాట్లలో థియేటర్లలో రానుంది. టీజర్ విడుదలతో సోషల్ మీడియాలో అవెంజర్స్ ఫీవర్ మళ్లీ పెరిగింది.



