సినిమా

అఖండ 2.. సామాన్యులకు ఊరట!

Akhanda 2 : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ డిసెంబర్ 5న పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 4 సాయంత్రం పైడ్ ప్రీమియర్ షోలు ఉంటాయి. ఈ టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయని మేకర్స్ స్పష్టం చేశారు.

బ్లాక్‌బస్టర్ హిట్ ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ 2’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ మరోసారి మాస్ అవతారమెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అంతకుముందు రోజు అంటే డిసెంబర్ 4 సాయంత్రం పైడ్ ప్రీమియర్ షోలు ఉంటాయని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రీమియర్ టికెట్ ధరలపై భారీ రేట్లు ఉంటాయనే ప్రచారం జరిగింది.

కానీ తాజాగా మేకర్స్ స్పందిస్తూ టికెట్ రేట్లు మీడియం రేంజ్‌లోనే ఉంటాయని, అందరికీ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. సంయుక్త మేనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా బాలయ్య అభిమానులకు పండుగ కానుకగా రానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button